పౌర్ణమి వేళ మంగళవారం చంద్రగ్రహణం సంభవిస్తుండటంతో వరంగల్ లోని అన్ని ప్రధాన ఆలయాలను మూసివేయనున్నారు. ఉదయం 7 గంటలలోపు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయాలను శుద్ధి చేసి, బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని దేవాదాయ శాఖ అధికారి రామల సునిత తెలిపారు. గ్రహణం సందర్భంగా తగిన జాగ్రత్తలు పాటించాలని భద్రకాళి దేవస్థానం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు సూచించారు.