తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి జూలై 6న జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) తెలిపారు. రెండు విడతల అడ్మిషన్ల అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన
విద్యార్థులు తమ అసలు ధ్రువపత్రాలతో సంబంధిత జిల్లా కేంద్రాలకు హాజరై ప్రవేశాల అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.