11వ రోజుకు చేరుకున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలు

2చూసినవారు
చరిత్రప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు పదకొండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి శరభవాహన సేవ, సాయంకాలం పుష్పరథ సేవపై అమ్మవారిని ఊరేగించారు. బ్రహ్మోత్సవాలలో ఈ రోజు ఉభయదాతలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కుల (పురగిరి క్షత్రియ) సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అనేకమంది పెరిక కులస్తులు అమ్మవారికి పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పూజాద్రవ్యములు శిరస్సు మీద ధరించి మేళతాళాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్