వరంగల్ కు మొంథా తుఫాన్ నష్టానికి కేంద్రం సహాయం అందించాలి

5చూసినవారు
వరంగల్ నగరంలో అక్టోబర్‌లో మెుంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, తుఫాను వల్ల కలిగిన నష్టంపై వరంగల్ ఎంపీ కడియం కావ్య లోక్‌సభలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. వరంగల్ బల్దియా పరిధిలో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో శివనగర్, డీకేనగర్ సహా 45 కాలనీలు తీవ్రంగా మునిగిపోయాయని, పోతన రోడ్, భద్రకాళి, బొండివాగు, పోచమ్మమైదాన్ రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలతో నిండిపోయాయని ఎంపీ వివరించారు. ఈ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, తగిన సహాయం అందించాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్