ఖమ్మంలో అత్యాచార యత్నానికి గురై, తీవ్ర గాయాలతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి, అమానుషానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారిని ఓదార్చారు. నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆమె పరిస్థితిని అనుక్షణం సమీక్షించాలని సూచించారు.