ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలి: సీపీ ఎన్. శ్వేత

0చూసినవారు
ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలి: సీపీ ఎన్. శ్వేత
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఎన్. శ్వేత, ఐపీఎస్, హనుమకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పనితీరును పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి, రసీదు అందజేయాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. శాఖాపరమైన ఫిర్యాదులను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో స్వీకరించి, వాటి పరిష్కారాన్ని బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలని సూచించారు.