రైలు లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

0చూసినవారు
రైలు లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్
హైదరాబాద్ అమీర్పేట్కు చెందిన ప్రేమ్ కుమార్ సికింద్రాబాద్ నుంచి కాజీపేట వెళ్లే హడప్సర్ రైలులో ప్రయాణిస్తుండగా, జనగామ సమీపంలో అతని బ్యాగును గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. రైల్వే కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు అందడంతో, కాజీపేటలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక బీదర్కు చెందిన విశాల్(25) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 2 సెల్ఫోన్లు, 2 ఇయర్ బడ్స్, 10 వేల నగదుతో కూడిన బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్