భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సాధు సంగీత ముదిరాజ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పలువురు తీవ్రంగా ఖండన వ్యక్తం చేస్తున్నారు.