వరంగల్ జిల్లా విభజనపై టీజేఎస్ ఆగ్రహం: పునరేకీకరణకు డిమాండ్

3చూసినవారు
చారిత్రక వరంగల్ నగరాన్ని హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా విభజించడం వల్ల రెండు జిల్లాల అభివృద్ధి కుంటుపడిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ అన్నారు. శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు జిల్లాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వరంగల్ నగరం హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చెందుతుందని ఆశించామని, కానీ విభజనతో ఆ ఆశలు నెరవేరలేదని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్