ఎనుమాముల మార్కెట్లో పసుపు క్వింటాకు రూ.13,811 ధర

7చూసినవారు
ఎనుమాముల మార్కెట్లో పసుపు క్వింటాకు రూ.13,811 ధర
చాలా రోజుల తర్వాత మంగళవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పసుపు తరలివచ్చింది. ఈ సందర్భంగా క్వింటా పసుపునకు రూ.13,811 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. మక్కలు బిల్టీ క్వింటా రూ.1,940 ధర పలికింది. ఎండల తీవ్రత కారణంగా హమాలీల విజ్ఞప్తి మేరకు ప్రతి బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో రేపు మార్కెట్ మూసివేయబడుతుంది.

సంబంధిత పోస్ట్