ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు ఒక కానిస్టేబుల్ సస్పెండ్

3చూసినవారు
ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు ఒక కానిస్టేబుల్ సస్పెండ్
వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, డబ్బు ఇవ్వని వారి ఇంటిపై దాడికి పాల్పడినందుకు ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో మద్యం సేవించి నైట్ ఇంచార్జి విధులు నిర్వహించినందుకు హెడ్ కానిస్టేబుల్ రాములు, స్టేషన్ అధికారి ఆదేశాలను అతిక్రమించినందుకు చెన్నారావుపేట స్టేషన్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you