హన్మకొండలో ఈ నెల 5న ఉదయం 10:30 గంటలకు 'తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక' విస్తృత సమావేశం జరగనుంది. చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ నివాసంలో జరిగే ఈ సమావేశంలో, ఉద్యమకారులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం, నెలకు రూ. 25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం కేటాయింపు, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి డిమాండ్లపై చర్చించనున్నారు. ఉద్యమకారుల త్యాగాలకు తగిన గుర్తింపు, సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు కోరనున్నారు.