పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి

11చూసినవారు
పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి
ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని పరిపాలన విభాగం భవనంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత చిత్రపటానికి అదనపు డీసీపీలు రవి, సురేష్, శ్రీనివాస్, ఏసీపీ సురేంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని అదనపు డీసీపీలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్