కాజీపేట మండలం 46వ డివిజన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వస్కుల శ్రీను నియమితులయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ నియామకం పట్ల పార్టీ శ్రేణులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తానని స్పష్టం చేశారు.