వరంగల్ నగరంలోని బట్టల బజార్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యాయమూర్తి గణపతి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు, సుప్రీంకోర్టు థీమ్‌తో రూపొందించిన పందిరి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. న్యాయవ్యవస్థ ప్రతీకలను ప్రతిబింబించేలా మండపాన్ని తీర్చిదిద్దడంతో భక్తులకు ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో చట్టాల పై అవగాహన పెంపొందించే విదంగా ఉంది.