మామునూరు విమానాశ్రయానికి “మహారాజ్ సర్వాయి పాపన్న గౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం”గా పేరు పెట్టాలని కోరుతూ జై గౌడ్ ఉద్యమ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేయూ పాలక మండలి సభ్యుడు డా. చిర్ర రాజు గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ చరిత్రలో సర్వాయి పాపన్న గౌడ్ పాత్రను గుర్తిస్తూ ఆయన పేరు పెట్టాలని లేఖలో కోరారు. విమానాశ్రయానికి పేరు పెట్టడం ద్వారా తెలంగాణ చారిత్రక వారసత్వానికి గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు.