వరంగల్: న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

68చూసినవారు
వరంగల్: న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వరంగల్, హనుమకొండ జిల్లాలో సోమవారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా బార్ అధ్యక్షులు వలుస సుదీర్, పులి సత్యనారాయణ జిల్లా బార్ అసోసియేషన్ హాల్ లో డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు జనార్దన్, సంజీవ రావు, జయాకర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.