వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్క శ్రావ్య, తెలిసిన యువకుడితో కలిసి హైదరాబాద్ నుంచి ద్విచక్రవాహనంపై వస్తుండగా, బుధవారం రాత్రి జనగామ జిల్లా జఫర్ గఢ్ మండలంలోని శంకర్నాయక్ తండా సమీపంలో బోళ్ల మత్తడి వద్ద ప్రవాహానికి కొట్టుకుపోయారు. యువకుడు ప్రాణాలతో బయటపడగా, యువతి గల్లంతయ్యింది. స్థానిక పోలీసులు, ఎన్ఆర్డీఎఫ్ సిబ్బంది గురువారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు తమ కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, సమగ్ర విచారణకు కోరారు. మృతదేహాన్ని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు.