ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వరంగల్ నగరం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. హన్మకొండలోని ప్రధాన రహదారులు, పలు కాలనీలు నీట మునిగాయి.
ముంపు ప్రాంతాల ప్రజలను ఎస్టీఆర్ఎప్ బృందం పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.