వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ–వరంగల్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయూబ్ లు కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుపై ఫిర్యాదు చేశారు. హంటర్ రోడ్డులో నిర్వహించిన సభలో కేటీఆర్ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన వారు, కేటీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.