వరంగల్: సైబర్ క్రైమ్ ఎస్ హెచ్ ఓ గా గిరికుమార్

58చూసినవారు
వరంగల్: సైబర్ క్రైమ్ ఎస్ హెచ్ ఓ గా గిరికుమార్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ కలకోట గిరికుమార్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్లోని సీసీ పోలీస్ స్టేషన్ లో హౌస్ ఆఫీసర్ గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైమ్ రేటును తగ్గించేందుకు తనదైన శైలిలో కృషి చేస్తానని తెలిపారు. అయితే, గిరికుమార్ గతంలో వరంగల్ లా అండ్ ఆర్డర్ విభాగం అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ గా చేశారు.

సంబంధిత పోస్ట్