తెలంగాణ రాష్ట్రంలో వైద్యులపై జరుగుతున్న దాడులను వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని నాయకులు డాక్టర్ బందెల మోహన్ రావు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులపై రోగి బంధువులు దాడులు చేయడాన్ని నిరసిస్తూ, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆసుపత్రులపై దాడులు, పరికరాల ధ్వంసం, సిబ్బందిపై భౌతిక దాడులు, పోలీస్ స్టేషన్‌లో ఉన్న వైద్యుడిపై దాడి వంటి ఘటనల్లో పోలీసులు పట్టించుకోలేదని అసోసియేషన్ నాయకులు ఆరోపించారు.