వరంగల్: అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

3చూసినవారు
వరంగల్: అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
వరంగల్ జిల్లా ఎనుమాముల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన షేక్ షకీల్, బబ్లూ అలియాస్ నిజాం, షఫీక్ షా అనే ముగ్గురు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు సీఐ జవ్వాజి సురేశ్ తెలిపారు. వీరిపై మహారాష్ట్రతో పాటు వరంగల్, జనగామ, మెదక్, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం పైడిపల్లి వద్ద కారులో పారిపోతున్న షేక్ షకీల్, బబ్లూలను అదుపులోకి తీసుకోగా, షఫీక్ షా పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 102 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, 5 నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్