వరంగల్ నగరంలోని రామన్నపేట బొడ్రాయి వద్ద అర్ధరాత్రి మద్యం మత్తులో అల్లుడు మామపై కత్తులతో దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం మామ ప్రతిదాడి చేయడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఏఎస్పీ శుభం ప్రకాష్ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.