కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండలోని ప్రసిద్ధ వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి, సిద్ధేశ్వర స్వామి ఆలయాల్లో నగర మేయర్ గుండు సుధారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సునీత, ప్రధాన అర్చకులు శేషు, గంగు ఉపేంద్ర శర్మ, సురేష్, ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణ, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పవిత్ర దినాన ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.