వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తన 70 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించింది. సాంకేతిక విద్యలో విశిష్ట గుర్తింపు పొందిన ఈ సంస్థ, చిన్న స్థాయిలో ప్రారంభమై వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచింది. మాజీ ఎంపీ ఇటికాల మధుసూదనా రావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కళాశాల, ప్రారంభంలో అజంజాహి మిల్లులోని ఒక షెడ్డులో 120 మంది విద్యార్థులతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులతో తరగతులు ప్రారంభించింది.