వరంగల్ రైల్వే స్టేషన్ గంజాయి మత్తులో ఉన్న యువకుల అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాట్‌ఫామ్‌లపై అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని బాధితులు చెబుతున్నారు. స్టేషన్‌లో పోలీసుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమని, అధికారులు వెంటనే గస్తీని పెంచాలని వారు కోరుతున్నారు.