వరంగల్-చింతలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గొర్రెకుంట క్రాస్ సమీపంలో డౌన్ లైన్‌పై గూడ్స్ రైలు కిందపడి గుర్తుతెలియని 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సిమెంట్ రంగు లోయర్, వైట్ ఫుల్ షర్ట్ (బ్లాక్ డిజైన్) ధరించి ఉన్నాడు. అతడి ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, చామనచాయ రంగు, గడ్డం, మీసాలు కలిగి ఉన్నాడు. కుడి చేతిపై “SOMESH” అనే పచ్చబొట్టు ఉంది. ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంలో ఉంచారు.