వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ హవేలీకి చెందిన దేవేందర్, సునీత దంపతులు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. మే 30న గృహప్రవేశానికి సిద్ధమవుతుండగా, తెల్లవారుజామున సునీతను పాము కాటేసింది. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం ఆమె మరణించింది. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టకముందే ఆమె మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.