మండలంలోని గుండేదు గ్రామంలో, పెళ్లయిన మూడు నెలల నుంచే వేధింపులకు గురిచేస్తూ, వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ తన కుటుంబీకులతో కలిసి నిరసన చేపట్టింది. ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన శ్రీజకు కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన డి. రాజుతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వరకట్నంగా రూ.12 లక్షల నగదు, 18 తులాల బంగారాన్ని అందజేసినా, వివాహం అనంతరం భర్త వేరే మహిళతో సన్నిహితంగా ఉంటూ శారీరకంగా, మానసికంగా వేధించాడని, అదనపు కట్నం కోసం హింసించాడని బాధితురాలు ఆరోపించింది.