ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులా?

3చూసినవారు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులా?
కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు BRS నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. దీనిని BRS మాజీ అధ్యక్షుడు బొల్లికొండ వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మేడిగడ్డ వద్ద నీటిని వృథా చేస్తూ, సాగునీటి కోసం రైతులు అల్లాడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న తమను అరెస్టులతో అణచివేయాలని చూడటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అప్రజాస్వామిక పోకడలను ఎండగట్టడం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్