పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ తనపై అత్యాచారం చేశాడని ఓ వివాహిత ఫిర్యాదు చేసింది. 'గతంలో నా భర్తపై ఫిర్యాదు చేసేందుకు హన్మకొండ PSకు వస్తే ఎస్ రాజ్ కుమార్ మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. తనకు కొడుకు లేడని, తన కోరిక తీర్చాలని, తన భార్యకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే ఫొటోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించాడు' అని లేఖలో పేర్కొంది. కాగా బాధితురాలు ఐజీకి ఫిర్యాదు చేయడంతో హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.