గురువారం నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట శివారు పద్మపురం గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో సులోచన (35) అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన వీరు బంధువుల దశదినకర్మకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం అందించడంతో క్షతగాత్రులను చర్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సులోచన మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.