గుండెపోటుతో మహిళ మృతి

9చూసినవారు
గుండెపోటుతో మహిళ మృతి
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లా తాడ్వాయికి చెందిన వడ్డెపల్లి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చెల్లెలు గట్టికొప్పుల లక్ష్మి కి ఈ విషయం తెలియగానే, తీవ్ర దుఃఖంతో గుండెపోటుతో కుప్పకూలింది. ఆమెను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సోదరుడి మృతిని తట్టుకోలేక చెల్లెలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్