మంగళవారం అర్ధరాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్న వరంగల్లోని కొరియర్ సెంటర్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆడెపు శివకుమార్(24) అనే యువకుడ్ని మార్గమధ్యలో మచ్చాపురం గ్రామం వద్ద కుక్కలు వెంబడించాయి. దీంతో బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న మురికి కాలువలో పడటంతో శివకుమార్ అక్కడికక్కడే మృతిచెందినట్లు గీసుకొండ ఎస్సై తెలిపారు. ఈ ఘటన గీసుకొండ మండలం ఎల్కతుర్తి హవేలీ గ్రామంలో చోటుచేసుకుంది.