పర్వతగిరి: 50 కేజీల బియ్యం, ఆర్థిక సహాయం అందజేత

53చూసినవారు
పర్వతగిరి: 50 కేజీల బియ్యం, ఆర్థిక సహాయం అందజేత
పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కట్ట శ్రీనివాస్ ఇటీవల మృతి చెందగా శనివారం సాయంత్రం వారికి 50 కేజీల బియ్యం, ఆర్థిక సహాయంను వడ్లకొండ మాజీ సర్పంచ్ అమడగాని రాజు యాదవ్ అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పట్టాపురం వెంకట్ రాజు, దాడి సదానందం, సంపత్, ప్రకాష్, రమేష్, లక్ష్మణ్, భాస్కర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.