వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ప్యాచ్ వర్క్ పనులు నిలిచిపోయాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడాయిల్ కొరత ఏర్పడి, డాంబర్ సరఫరా ఆగిపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో రహదారిపై దుమ్ము, చిన్న రాళ్లు తేలి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక్క రోజులోనే ఎనిమిది మంది గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.