సిట్ నోటీసులపై బీఆర్ఎస్ నేతల ఆందోళన: ఎమ్మెల్యే నాగరాజు ఘాటు విమర్శలు

2చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రాస్తారోకోలు, నిరసనలు వారి భయాందోళనలకు నిదర్శనమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తీవ్రంగా మండిపడ్డారు. నోటీసులు వస్తేనే ఇంత గందరగోళం ఎందుకు, నిర్దోషులైతే విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తప్పు చేయనివారు రోడ్డెక్కి డ్రామాలు చేయరని, సిట్ విచారణకు హాజరై నిజాలు చెప్పే ధైర్యం లేకనే నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. సొంత కూతురే తప్పు జరిగిందని చెప్పినా, ఇంకా అబద్ధాలపై బతకాలని చూస్తున్నారని అన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా చట్టప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను ఉద్దేశించి చెప్పారు. ఎవరు ఎంత పెద్ద నేతలైనా, ఎంత కాలం ముఖ్యమంత్రులైనా చట్టం ముందు అందరూ సమానమే అని కఠినంగా హెచ్చరించారు. దొంగే దొంగ అన్నట్టు బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఉందని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.

ట్యాగ్స్ :