ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్
ఇండియా (ఏఏఐ) అధికారులు రెండు రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ బృందంలో ఏఏఐ ఈడీ ఎస్. కె. గుప్తా, జై గౌరవ్ చౌదరి, జేజీఎం బాలేందర్ కుమార్ తివారి, కేజీఎం గోపాలకృష్ణలు ఉన్నారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి. సంధ్య రాణి కూడా ఉన్నారు. మామునూరు విమానాశ్రయానికి ప్రత్యేక డిజైన్ రూపకల్పనలో భాగంగా ఏఏఐ అధికారులు విమానాశ్రయ స్థలాన్ని పరిశీలించారు.