నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

913చూసినవారు
నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా నిరుపేదలకు వైద్య సహాయం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనకు నిదర్శనమని అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధికి చెందిన నమాసాని నాగరాజు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, సీఎంఆర్ఎఫ్ నిధి నుంచి రూ. 1,73,950 మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ చెక్కును ఎమ్మెల్యే నాగరాజు లబ్ధిదారునికి అందజేశారు.

సంబంధిత పోస్ట్