వర్ధన్నపేట మండలం, నల్లబెల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన జక్కి అనిత శ్రీకాంత్, గెలుపొందిన పది రోజుల్లోనే గ్రామాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రశంసలు అందుకుంటున్నారు. మండలంలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన నల్లబెల్లి గ్రామ చెరువు కట్టపై గత 15 సంవత్సరాలుగా పెరిగి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న ముళ్లపొదలను తొలగించే పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.