చికిత్స పొందుతూ 14 రోజుల తరువాత మృతి

0చూసినవారు
చికిత్స పొందుతూ 14 రోజుల తరువాత మృతి
వర్ధన్నపేట మండలం భవానికుంట తండాకు చెందిన ఆంగోతు నరేష్ (30) అనే యువకుడు, కుటుంబ సభ్యులతో కలిసి అన్నారం షరీఫ్ వెళ్లి వస్తుండగా ఆటోలో నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ నెల 14న జరిగిన ఈ ప్రమాదంలో తల, చేతులకు గాయాలైన నరేష్‌ను మొదట వర్ధన్నపేట, ఆపై హనుమకొండలోని అమృత ఆసుపత్రికి తరలించారు. అక్కడ 14 రోజుల పాటు చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతుడి తండ్రి జాధ్య ఫిర్యాదు మేరకు పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్