వరంగల్ జిల్లాలోని ఏనుమాముల గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఒక వృద్ధుడు మృతి చెందాడు. అడప కృష్ణమూర్తి అనే వృద్ధుడు వరద నీటిలో పడి మరణించినట్లు సమాచారం. అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.