వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. గాయత్రీ చిల్లీస్ యజమాని తిరుపతి మూడు కోట్ల రూపాయలతో పరారీ అవ్వడంతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పలువురు వ్యాపారులకు ఐటీ నోటీసులు అందాయి. గతంలో జమ్మికుంట్ల మార్కెట్లో కూడా తిరుపతి ఐపీ పెట్టినట్లు వ్యాపారులు తెలిపారు. దీంతో మిర్చి కాంటాలు నిలిచిపోయాయి.