కల్లెడ గ్రామానికి చెందిన చిరుత సతీశ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, పిచ్చికుక్క దాడి చేసి ఎడమ చేతి ఉంగరం వేలును కొరికింది. తీవ్ర గాయాలైన సతీశ్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కల్లెడలో కొద్ది రోజులుగా పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై దాడి చేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.