వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన కరాటే పోటీలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆటలు, ధ్యానం వంటివి వారి మేధస్సును మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. పాఠశాల నుండి వచ్చిన తర్వాత పిల్లలకు సమయం కేటాయించి, సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన సూచించారు.