విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

0చూసినవారు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు మంగళవారం  అరెస్ట్ చేశారు. మామునూరు ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ సంతోష్, ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం, క్రైమ్ నంబర్ 205/2026 కింద కేసు నమోదు చేశారు. మరో యువతిని ఉద్యోగం పేరుతో మోసం చేసినట్లు టేకుమట్ల పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది. బాధితుడికి డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మించి 50 వేలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్