హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరై, చరఖా అభ్యాస్ ప్రాముఖ్యతను వివరించారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, శాంతి, అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయాలు నేటి సమాజానికి మరింత అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, KUDA చైర్మన్ శ్రీ ఇనగాల వెంకటరామిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ ఆయూబ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.