ఐనవోలు మండలం వనమాలకనపర్తికి చెందిన గట్టు రజినీకాంత్ (25) తాటిచెట్టు దిగుతుండగా జారిపడి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబాన్ని కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాంబయ్యగౌడ్, కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బత్తిని నాగరాజుగౌడ్ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితుడి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.