విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఏదైనా సాధించాలంటే అది కూడా చదువుతూనే నెరవేరుతుందని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి మండలం జయగిరి గ్రామంలో గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు.